ప్రియాన్ష్ ఆర్య కొట్టిన సిక్సర్ దెబ్బకు స్టాండ్స్‌లో రక్తమోడిన అభిమాని.. ఇదిగో వీడియో!
- ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న అభిమానికి సిక్సర్ దెబ్బ
- ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతి ముఖానికి తగిలి తీవ్ర గాయం
- రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలింపు
- పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘటన
- ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 29 పరుగులు చేసిన ప్రియాన్ష్
ముల్లన్‌పూర్‌లో నిన్న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన భారీ సిక్సర్.. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని ముఖానికి బలంగా తగిలింది. దీంతో ఆయన ముఖం నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది.
ఈ ఘటన మ్యాచ్ రెండో ఓవర్‌లో జరిగింది. రాజస్థాన్ బౌలర్ నండ్రే బర్గర్ వేసిన బంతిని ప్రియాన్ష్ సిక్సర్‌గా మలచగా, అది నేరుగా వెళ్లి గ్యాలరీలోని అభిమానిని గాయపరిచింది. బంతి తగిలిన వెంటనే ఆయన ముఖం నుంచి రక్తం ధారగా కారడంతో చొక్కాపై కూడా రక్తపు మరకలు పడ్డాయి. వెంటనే స్పందించిన తోటి ప్రేక్షకులు ఆయనకు సాయం చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ఇక, ఈ మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్య మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు చేశాడు. అయితే, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మూడో ఓవర్‌లో మిడ్-ఆన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, ఈ సీజన్‌లో ప్రియాన్ష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 40.42 సగటుతో 283 పరుగులు సాధించాడు.