జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  • చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, అనుచిత పోస్టుల కేసు
  • పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు
  • కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, సోషల్ మీడియా అనుచిత పోస్టుల వ్యవహారంలో జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పూడి శ్రీహరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు లేదా విచారణ నుంచి ఎలాంటి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం నిరాకరించింది.


గతంలో కుప్పం ట్రయల్ కోర్టు రిమాండ్‌ను తిరస్కరిస్తూ శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. అయితే, ఏపీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా.. కుప్పం కోర్టు ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేస్తూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో, శ్రీహరి హైకోర్టు తీర్పును సవాల్ ను చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శ్రీహరికి బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. కేసు విచారణకు పూర్తగా సహకరించాలని ఆదేశించింది.

Pudi Srihari
YSRCP
Supreme Court

More Telugu News