వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు: సజ్జనార్

Telangana
Advertisement
  • పెట్రోల్ బంక్‌లో యువకుల బైక్ స్టంట్‌పై సీపీ సజ్జనార్ ఆగ్రహం
  • అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు చేసిన విన్యాసం వికటించిన వీడియో వైరల్
  • 'వీలింగ్స్' తల్లిదండ్రులకు కన్నీటి 'ఫీలింగ్స్' మిగల్చొద్దంటూ హితవు
  • ప్రమాదకర ప్రదేశాల్లో స్టంట్లు మూర్ఖత్వమని హెచ్చరిక
  • బాధ్యతగా మెలగాలని యువతకు సజ్జనార్ సూచన
Advertisement
యువత రోడ్లపై చేసే ప్రమాదకర బైక్ విన్యాసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి తీవ్రంగా స్పందించారు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో కొందరు యువకులు చేసిన బైక్ స్టంట్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, యువతకు ఆయన గట్టిగా హితవు పలికారు.

వివరాల్లోకి వెళితే, ఓ పెట్రోల్ బంకు వద్ద అమ్మాయిలను చూసి ఇద్దరు యువకులు బైక్‌పై వీలింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ స్టంట్ వికటించి మరో బైక్ ను ఢీకొట్టారు. దీంతో అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఓ వ్యక్తి ఆ యువకుడిపై చేయి కూడా చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వీడియోను పంచుకుంటూ సజ్జనార్ తనదైన శైలిలో స్పందించారు. "వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!? గుర్తుంచుకోండి.. మీరు చేసే వీలింగ్స్ ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి ఫీలింగ్స్ మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి" అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. క్షణికావేశంలో చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని యువతకు సూచించారు.
Advertisement

సంబంధిత వార్తలు

SajjanarBikersWheelingsPublic PlacesPoliceHyderabadTelangana

More Telugu News

డ్రైవర్ అప్రమత్తత... పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు

04 Nov, 06:21

కడప, విజయనగరం కార్పొరేషన్లు టీడీపీ కైవసం.. కూటమి క్లీన్ స్వీప్

04 Nov, 06:17

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10
..More Telugu News