విశాఖ ఇకపై 'ఏఐ పట్నం'.. చంద్రబాబుకు కేంద్రం హ్యాట్సాఫ్: అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్

Ashwini Vaishnab praises Chandrababu
  • విశాఖపట్నంలో 'గూగుల్ ఏఐ డేటా హబ్'కు శంకుస్థాపన
  • డేటా సెంటర్ ను ప్రధాని త్వరలోనే ప్రారంభిస్తారన్న వైష్ణవ్
  • జూన్ 1న రైల్వే జోన్ ను అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడి

విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'గూగుల్ ఏఐ డేటా హబ్'కు శంకుస్థాపన జరిగింది. ఈ డేటా హబ్ తో టెక్ రంగంలో ఏపీ రూపురేఖలు మారిపోనున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని చాటిచెప్పింది.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, యువనేత లోకేశ్ కార్యదక్షత కలగలిసి విశాఖను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలపబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన వేదికగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


"అప్పట్లో చంద్రబాబు నిర్మించిన సైబర్ టవర్స్ నేడు ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచాయి. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖలో నిర్మిస్తున్న ఏఐ డేటా హబ్ ప్రపంచస్థాయి నిపుణులను ఆకర్షిస్తుంది. ఆయన నిజమైన విజనరీ లీడర్" అని కొనియాడారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ శక్తిసామర్థ్యాలను వైష్ణవ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రాజెక్టుపై లోకేశ్‌కు ఉన్న స్పష్టత, సమస్యలను పరిష్కరించే తీరు యువ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు పార్లమెంట్‌లో ఏపీ గొంతుకగా నిలుస్తున్నారని మెచ్చుకున్నారు.


అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్:

"విజనరీ లీడర్ చంద్రబాబు హైదరాబాద్ లో నిర్మించిన సైబర్ టవర్ ఐటీకి ఐకానిక్. గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా మారుతుంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు సెల్యూట్ చేస్తున్నాను. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోంది. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయి. ఎంఓయూ చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరుగుతోంది. ఏఐ డేటా సెంటర్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునే రోజు దగ్గర్లోనే ఉంది. ఐటీ సేవల రంగంలో భారత్ లీడర్ గా ఎదిగింది. మన దేశంలోని నాయకత్వం కీలకంగా వ్యవహరించింది.

గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయింది. సెమీ కండక్టర్లు, చిప్, ల్యాప్ టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. ప్రధాని మోదీ చొరవతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశాం. భారత్ నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్లు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా అవసరమైన 50 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాం. మేజర్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్, డిజైన్ చేసే దేశంగా భారతదేశాన్ని గుర్తించాలి. సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా ఇప్పటికే వాణిజ్య పరమైన ఉత్పత్తిని ప్రారంభించాం. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిలో భారత్ ఎంతో ఎదిగింది.

డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసేలా టెక్ కంపెనీలు కృషి చేయాలి. గూగుల్ కూడా తమ సర్వర్లను, జీపీయూ, చిప్ లను ఇక్కడే ఉత్పత్తి చేసేలా చూడాలి. భారతదేశం చేస్తున్న ఈ సూచనను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు కూడా తెలియచేయాలని విజ్ఞప్తి. తక్కువ వ్యయంతోనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలుంది. విశాఖ నుంచి 3 సబ్ సీ కేబుల్స్ ను వేస్తున్నందుకు గూగుల్ కు ధన్యవాదాలు. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరోప్ కు, అఫ్రికా మీదుగా అమెరికాకు వెళ్లేలా ఈ సబ్ సీ కేబుల్స్ వేస్తున్నారు.

డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ద్వారా ఏపీకి రూ. 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించాం. గతంలో ఉమ్మడి ఏపీకి కేవలం రూ. 886 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఏపీని కనెక్ట్ చేస్తూ నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోనే తొలిసారి నవ నిర్మాణ్ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 74 స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. 832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం జరిగాయి. 1039 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏపీ.16 వందే భారత్ సర్వీసులు ఏపీలో నడుస్తున్నాయి. 22 అమృత్ భారత్ సర్వీసులు కూడా ఏపీ నుంచి నడుస్తున్నాయి. రైళ్ల డిజైన్, ఉత్పత్తిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏపీలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లాంటి కీలకమైన విభజన హామీని కేంద్రం నెరవేర్చింది.

2026 జూన్ 1 తేదీన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నాం. అమరావతి నుంచి హైదరాబాద్ కు బులెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారం కాబోతోంది. 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్ కు చేరుకునేలా ఈ ప్రాజెక్టు వస్తోంది. 112 నిమిషాల్లో అమరావతి నుంచి చెన్నైకు చేరుకునేలా బులెట్ ట్రైన్ నిర్మాణం చేస్తాం. అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రతీ అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయి. కోల్ కోతా నుంచి చెన్నై వరకూ ఉన్న తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను ఫోర్ లైన్లుగా మారుస్తాం. కంటైనర్, ఫ్రైట్ ట్రైన్లతో పాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తాం" అని తెలిపారు.
Go Back to Shorts
Ashwini Vaishnav
BJP
Chandrababu
TDP

More Telugu News