ఇన్ఫోసిస్ కు 20 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

AP Government Allocates 20 Acres to Infosys in Visakhapatnam
  • విశాఖలో ఇన్ఫోసిస్ కు 20 ఎకరాల కేటాయింపు
  • రూ. 750 కోట్లతో క్యాంపస్ ను విస్తరించనున్న ఇన్ఫోసిస్
  • 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు విశాఖపట్నంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 750 కోట్ల భారీ పెట్టుబడితో ఇన్ఫోసిస్ తన కేంపస్‌ను ఇక్కడ విస్తరించనుంది.


ఈ కొత్త కేంపస్ ద్వారా ప్రారంభ దశలోనే సుమారు 7 వేల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఐటీ, ఐటీఈఎస్ (ITeS) కేంపస్ ద్వారా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్రాసెస్ రంగాల్లో విశాఖ గ్లోబల్ సెంటర్‌గా మారనుంది. ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ బ్రాండ్ రాకతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా, మరిన్ని అనుబంధ సంస్థలు విశాఖ వైపు చూసే అవకాశం ఉంది.
Go Back to Shorts
Infosys
Andhra Pradesh
Visakhapatnam
IT sector
Software jobs
AP government
Investment
IT development
Business process
ITeS

More Telugu News