దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత... అకోలాలో 46.9 డిగ్రీలు నమోదు

National
Advertisement
  • నాగ్‌పూర్, విదర్భలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు
  • దేశంలోని అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన
Advertisement
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగ్‌పూర్, విదర్భలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచాయి. ఈ సంవత్సరం మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటాయి. దీనితో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

ఈ వారం మొత్తం దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నాగ్‌పూర్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు చేరుకోవచ్చని, కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం దేశంలోనే అత్యధికంగా అకోలాలో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. అమరావతి (మహారాష్ట్ర)లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.

వాతావరణ శాఖ డేటా ప్రకారం, వార్దాలో 46.4 డిగ్రీలు, యవత్మాల్‌లో 46 డిగ్రీలు, నాగ్‌పూర్‌లో 45.4 డిగ్రీలు, చంద్రాపూర్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భ ప్రాంతంలో తీవ్రమైన వడగాలులు వీచాయని తెలిపింది. ఈ ప్రాంతంలో మంగళవారం వరకు ఈ వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Akola hottest in India at 46.9 deg C

More Telugu News

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్.. ఆధిక్యంలో డెమోక్రాట్లు!

04 Nov, 07:12

పట్టభద్రులకు ఊరట: తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు

04 Nov, 06:45

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

04 Nov, 06:44

డ్రైవర్ అప్రమత్తత... పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు

04 Nov, 06:21

కడప, విజయనగరం కార్పొరేషన్లు టీడీపీ కైవసం.. కూటమి క్లీన్ స్వీప్

04 Nov, 06:17

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41
..More Telugu News