నాకు మరో అవకాశం దక్కడం నా అదృష్టం: ముంబైలో సీఎం చంద్రబాబు
- ముంబైలో ‘బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- సైబరాబాద్ తర్వాత అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అవకాశం దక్కిందని వెల్లడి
- హైదరాబాద్‌ను మించిన నగరంగా, ఫ్యూచర్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ
- మోదీ ఒక రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంస
- గ్రీన్ ఎనర్జీ, ఏఐ, జనాభా నిర్వహణ వంటి భవిష్యత్ ప్రణాళికలను వివరించిన చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ను నిర్మించి దేశానికి ఒక టెక్నాలజీ రాజధానిని అందించిన తనకు, రాష్ట్ర విభజన అనంతరం అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అద్భుతమైన అవకాశం దక్కిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని, అమరావతిని కేవలం ఒక రాజధానిగా కాకుండా, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే 'ఫ్యూచర్ సిటీ'గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.
ముంబైలో ప్రతిష్ఠాత్మక 'ఎకనమిక్ టైమ్స్' సంస్థ నిర్వహించిన ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 'బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025' అవార్డును ఆయన అందుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమంపై తన దార్శనికతను ఆవిష్కరించారు.
హైదరాబాద్‌ను మించిన నగరంగా అమరావతి
"రాష్ట్ర విభజన తర్వాత నాకు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా మరో నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. గతంలో సైబరాబాద్ నిర్మాణంతో దేశానికి ఒక టెక్నాలజీ క్యాపిటల్‌ను ఇవ్వగలిగాం. ఇప్పుడు అమరావతిని అంతకుమించి తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ఇది కేవలం ఇటుకలు, కాంక్రీటుతో కట్టే నగరం కాదు. గ్రీన్, బ్లూ సిటీగా, నెట్-జీరో కార్బన్ కాన్సెప్టుతో పర్యావరణ హితంగా నిర్మిస్తున్నాం. హైదరాబాద్ కంటే మెరుగైన, అన్ని హంగులున్న 'హైదరాబాద్ ప్లస్' నగరంగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ అవార్డు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నానని, పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ వేదికగా పిలుపునిచ్చారు.
సంస్కరణలతోనే సంపద సృష్టి
నాలున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు, తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా చూశానని చంద్రబాబు తెలిపారు. "సంపద సృష్టికి సంస్కరణలే పునాది. సంస్కరణలు అమలు చేస్తేనే అభివృద్ధి సాధ్యం, ఆ అభివృద్ధి ఫలాలను సంక్షేమ రూపంలో ప్రజలకు అందించగలం. 1990లలో వచ్చిన ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజన్ 2020 అమలు చేశాం. దాని ఫలాలనే హైదరాబాద్ ఇప్పుడు అనుభవిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు '2047 వికసిత్ భారత్' లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్ష. ప్రధాని మోదీ ఒక అత్యుత్తమ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్. ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది" అని చంద్రబాబు ప్రశంసించారు.
గ్రీన్ ఎనర్జీ, ఏఐతో నవశకం
భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)దేనని చంద్రబాబు అన్నారు. "గతంలో విద్యుత్ సంస్కరణలతో మిగులు విద్యుత్ సాధించాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ అమ్మోనియా వంటి రంగాలపై దృష్టి పెట్టాం. ప్రధాని 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం పెడితే, అందులో ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 90 గిగావాట్ల దిశగా అడుగులు వేశాం. త్వరలోనే విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతాం," అని తెలిపారు. ఏఐ టెక్నాలజీని పాలనలో భాగం చేస్తూ ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్ వంటి సేవలు అందిస్తున్నామన్నారు. విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని, ఈ నెల 28న దానికి శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు.
అభివృద్ధితో పాటే సంక్షేమం
అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా చేరాలని చంద్రబాబు అన్నారు. "మన సమాజం కేవలం మిలియనీర్లు, బిలియనీర్ల కోసం మాత్రమే కాదు, సామాన్యులది కూడా. అందుకే 'పీ4' (ప్రజలు, పేదలు, భాగస్వామ్యం, ప్రగతి) కార్యక్రమాన్ని రూపొందించాం. సమాజంలో 10 శాతం ఉన్న ధనవంతులు, 20 శాతం ఉన్న పేదలను ఆదుకునేలా 'ఎంబీకే 10-20' ఫార్ములాను తీసుకొచ్చాం. సంపన్నులు మార్గదర్శకులుగా మారి పేదలను చేయూతనివ్వాలి," అని ఆయన పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ, మహిళలు సంకల్పిస్తే ఈ బిల్లు తప్పకుండా అమలవుతుందని, దీనికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
భవిష్యత్తు కోసం జనాభా నిర్వహణ
దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక వినూత్నమైన ఆలోచనను చంద్రబాబు పంచుకున్నారు. "మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణను బలంగా అమలు చేశాం. కానీ భవిష్యత్తులో మన దేశం జనాభా కొరతను ఎదుర్కోనుంది. డబ్బుంటే పరిశ్రమలు పెట్టొచ్చు, కానీ జనాభాను సృష్టించలేం. ప్రస్తుతం భారత్ ఫెర్టిలిటీ రేటు 1.9 ఉండగా, ఏపీలో అది 1.5 మాత్రమే. అందుకే, ముందుచూపుతో 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ'ని తీసుకురావాలని నిర్ణయించాం. భవిష్యత్తులో జనాభా ఉన్న దేశాలే సంపన్న దేశాలుగా నిలుస్తాయి," అని చంద్రబాబు తన దూరదృష్టిని వివరించారు.