ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్.. మంత్రి పదవిపై కోదండరాం ఏమన్నారంటే..!
- కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం
- తనకు మంత్రి పదవిపై ఆశ లేదన్న కోదండరాం
- ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని వ్యాఖ్య
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొఫెసర్ కోదండరాం, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ల అభ్యర్థిత్వాలను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా మరికొద్ది సేపట్లో విడుదల కానుంది.
ఎమ్మెల్సీగా నియామకం ఖరారైన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆశ లేదని, ప్రజా సమస్యలపై గొంతు వినిపించేందుకే ఎమ్మెల్సీ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. వ్యక్తిగత లాభం కంటే ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
మరోవైపు, ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ సీటు ఖరారు కావడంతో పెద్ద ఊరట లభించింది. అన్ని చిక్కులు తొలగిపోవడంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. గెజిట్ విడుదలైన తర్వాత వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.