యూట్యూబర్ ముసుగులో హంతకుడు... 31 ఏళ్ల నాటి హత్య కేసులో అరెస్ట్
- యూట్యూబర్ సలీం వాస్తిక్‌పై ఇటీవల దాడి
- దాడి ఘటనతో వెలుగులోకి వచ్చిన 31 ఏళ్ల నాటి హత్య కేసు
- బాలుడి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన సలీం
- దశాబ్దాలుగా పరారీలో ఉంటూ యూట్యూబర్‌గా కొత్త జీవితం
- ప్రస్తుతం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఢిల్లీ పోలీసులు
తాను ఒక 'ఎక్స్-ముస్లిం' అని ప్రకటించుకుంటూ యూట్యూబర్‌గా పేరు పొందిన సలీం వాస్తిక్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇటీవల ఘాజియాబాద్‌లో హత్యాయత్నానికి గురైన సలీం, 31 ఏళ్ల క్రితం జరిగిన బాలుడి హత్య కేసులో జీవిత ఖైదు పడిన దోషి అని దర్యాప్తులో తేలింది. దశాబ్దాలుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
గత ఫిబ్రవరిలో ఘాజియాబాద్‌లోని తన కార్యాలయంలో సలీంపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సలీం, ఆసుపత్రిలో చికిత్స పొందాడు. దాడి చేసిన జీషాన్, గుల్ఫామ్ అనే ఇద్దరూ ఆ తర్వాత పోలీస్ ఎన్‌కౌంటర్లలో మరణించారు. అయితే, ఈ దాడి ఘటన తర్వాత సలీం వాస్తిక్ గతంపై పోలీసులు దృష్టి సారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళితే.. 1995లో ఢిల్లీకి చెందిన సందీప్ బన్సాల్ (13) అనే బాలుడిని కిడ్నాప్ చేసి, రూ.30,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత బాలుడిని హత్య చేశారు. ఈ కేసులో అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న సలీం ఖాన్ (ప్రస్తుత సలీం వాస్తిక్)ను, అతని సహచరుడు అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 1997లో కర్కర్‌దూమా కోర్టు ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది.
అయితే, 2000 సంవత్సరంలో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన సలీం, తిరిగి కోర్టుకు హాజరుకాకుండా పరారయ్యాడు. అప్పటి నుంచి గుర్తింపు మార్చుకుని హర్యానా, ఘాజియాబాద్‌లలో బట్టల వ్యాపారం చేస్తూ జీవించాడు. ఇటీవలి కాలంలో యూట్యూబర్‌గా, సామాజిక కార్యకర్తగా కొత్త అవతారమెత్తి, మతంపై వివాదాస్పద వీడియోలు చేస్తూ గుర్తింపు పొందాడు. తాజాగా దాడి ఘటనతో అతడి అసలు స్వరూపం బయటపడింది. పాత రికార్డులు, వేలిముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, అతడిని అరెస్ట్ చేసి జీవిత ఖైదు శిక్ష అమలు కోసం తీహార్ జైలుకు తరలించారు.