ముంబైలో చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం

  • ముంబైలో చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
  • ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసిన ఎకనమిక్ టైమ్స్
  • పేదరిక నిర్మూలనకు P4 పథకం ఒక గేమ్ ఛేంజర్ అన్న సీఎం
  • విజన్ 2020 ఫలితమే హైదరాబాద్ అభివృద్ధి అని వెల్లడి
  • టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ముంబైలో నిర్వహించిన ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆయనకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు పురస్కారం స్వీకరించారు. పాలనా సంస్కరణలకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన ఈ గౌరవాన్ని పొందారు.

అవార్డు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “పేదరిక నిర్మూలన కోసం మేం తీసుకొచ్చిన పీ4 పథకం ఒక గేమ్ ఛేంజర్. ఈ పథకం ద్వారా లక్ష మంది మార్గదర్శకులు, 10 లక్షల మందిని దత్తత తీసుకున్నారు. సమాజంలో లింగ సమానత్వం, మహిళా సాధికారత కూడా ఎంతో ముఖ్యం” అని ఆయన వివరించారు.

తాను సంస్కరణలకు ముందు, ఆ తర్వాత దేశ పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేశానని చంద్రబాబు తెలిపారు. “సంస్కరణలకు అనుగుణంగానే విజన్ 2020ని అమలు చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపిస్తున్న అభివృద్ధి ఫలాలు దాని ఫలితమే. సాంకేతికతను ఉపయోగించుకుని అభివృద్ధి దిశగా ప్రయాణించాలి” అని ఆయన పేర్కొన్నారు. 

Chandrababu Naidu
Andhra Pradesh
Business Reformer of the Year
Economic Times Awards
P4 scheme
Hyderabad development
Technology
Governance reforms
Women empowerment
Vision 2020

More Telugu News