నేను బీజేపీలో చేరడం లేదు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

Preeti Reddy clarifies she is not joining BJP
  • బీజేపీ కార్యాలయానికి వెళ్లిన ప్రీతిరెడ్డి
  • బీజేపీ నేతలతో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టీకరణ
  • విద్యావేత్తను కాబట్టి అన్ని పార్టీలతో కలుస్తానన్న ప్రీతిరెడ్డి
తాను బీజేపీలో చేరడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆమె బీజేపీ కార్యాలయానికి వెళ్లడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో సమావేశమయ్యారు.

ఈ భేటీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను విద్యావేత్తనని గుర్తుంచుకోవాలని అన్నారు. తాను అన్ని పార్టీలను కలుస్తానని అన్నారు. డిజిటల్ ఇండియా కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లు ఆమె తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు.
Go Back to Shorts
Preeti Reddy
Malla Reddy
BRS
BJP
Telangana Politics
Digital India
AI Campus
Narendra Modi
Mallareddy University

More Telugu News