సూరత్ రోడ్లపై 'ఘోస్ట్ సైకిల్'... వైరల్ వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూరత్ రోడ్లపై 'ఘోస్ట్ సైకిల్'... వైరల్ వీడియో ఇదిగో!

Ghost Ccyle on Surat roads
  • సూరత్ వీధుల్లో సొంతంగా నడిచే 'ఘోస్ట్ సైకిల్'
  • రూపొందించిన 19 ఏళ్ల యువకుడు శివమ్ మౌర్య
  • కేవలం రూ.35 వేల బడ్జెట్‌తో తయారీ
  • ఏఐ, సెన్సార్లతో అడ్డంకులను గుర్తించి ప్రయాణం
  • యజమాని వెంటే వెళ్లే 'ఫాలో మీ' మోడ్ ప్రత్యేకత
గుజరాత్‌లోని సూరత్ వీధుల్లో ఓ వింత సైకిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దానిపై మనిషి లేకపోయినా, దానంతట అదే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. 'ఘోస్ట్ సైకిల్'గా పిలుస్తున్న ఈ అద్భుత ఆవిష్కరణను, శివమ్ మౌర్య అనే 19 ఏళ్ల యువకుడు కేవలం రూ.35,000 ఖర్చుతో రూపొందించడం విశేషం.

ఈ సైకిల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అధునాతన సెన్సార్లను శివమ్ ఉపయోగించాడు. వీటి సాయంతో సైకిల్ తన ముందున్న అడ్డంకులను గుర్తించి, వాటిని తప్పించుకుంటూ ప్రయాణిస్తుంది. కిందపడిపోకుండా నిటారుగా ఉండేందుకు 'గైరోస్కోప్' టెక్నాలజీని వాడారు. అందుకే స్టాండ్ లేకుండానే ఇది బ్యాలెన్స్ చేసుకోగలదు.

ఈ సైకిల్‌కు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. వాయిస్ కమాండ్ల ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అలాగే, తన మొబైల్ ఫోన్ లేదా రిమోట్ సహాయంతో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయగలడు. యజమాని ఎక్కడికి వెళ్తే అక్కడికి వారి వెంటే నడిచివచ్చే 'ఫాలో మీ' మోడ్ కూడా ఇందులో ఉంది. ఈ ఫీచర్ కారణంగానే దీనికి 'ఘోస్ట్ సైకిల్' అనే పేరు వచ్చింది.

లక్షల రూపాయలు ఖర్చయ్యే సెల్ఫ్-డ్రైవింగ్ టెక్నాలజీని, శివమ్ తన సొంత ప్రతిభతో, అతి తక్కువ ఖర్చుతో సాధించి చూపించాడు. భవిష్యత్తులో డెలివరీ రోబోలు వంటి ఆవిష్కరణలకు ఇది ఒక నమూనాగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శివమ్ లాంటి యువ మేధావులను ప్రోత్సహిస్తే దేశం నుంచి మరిన్ని అద్భుతాలు సాధ్యమవుతాయని ఇది నిరూపిస్తోంది.
Advertisement
Ghost Cycle
Surat
Shivam
Technology
Gujarat

More Telugu News