నా జుట్టు మెరుపు వెనుక ఉన్న రహస్యం ఇదే... శ్రేయో ఘోషాల్ ఎంత సింపుల్ గా చెప్పింది?

Shreya Ghoshal reveals hair secret
  • తన జుట్టు సౌందర్య రహస్యాన్ని బయటపెట్టిన శ్రేయా ఘోషల్
  • నిగనిగలాడే కురులకు కొబ్బరి నూనే కారణమని వెల్లడి
  • లండన్‌లో బ్రిటిష్ వోగ్‌ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడి
  • కచేరీలో లెజెండరీ గాయని ఆశా భోస్లేకు నివాళి అర్పించిన గాయని
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన పొడవైన, నిగనిగలాడే జుట్టు వెనుక ఉన్న రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. లండన్‌లో బ్రిటిష్ వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన జుట్టు అందానికి కారణం ఒక సాధారణ భారతీయ చిట్కా అయిన 'కొబ్బరి నూనె' అని ఆమె వెల్లడించారు. ఈ సింపుల్ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కన్సర్ట్ టూర్‌లో భాగంగా లండన్‌ వెళ్లిన శ్రేయా, అక్కడి ప్రతిష్ఠాత్మక ఓ2 ఎరీనాలో హౌస్‌ఫుల్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో, "మీ జుట్టు ఇంత అందంగా, మెరిసిపోతూ ఎలా ఉంటుంది?" అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ "ఇండియన్ చిట్కా... కొబ్బరి నూనె" అని నవ్వుతూ చెప్పారు. ఈ కచేరీలో ఆమె పొడవైన జుట్టుతో ప్రత్యేకంగా కనిపించగా, ఆ లుక్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు.

ఇదే వేదికపై ఆమె లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు నివాళి అర్పించారు. ఆశా ఆలపించిన "డమ్ మారో డమ్", "అభీ నా జావో ఛోడ్ కర్" వంటి క్లాసిక్ పాటలను పాడి ఆమె సంగీత సేవలను గుర్తుచేసుకున్నారు. ఒక అంతర్జాతీయ స్టార్‌గా ఉండి కూడా శ్రేయా ఘోషల్ తన మూలాలను మర్చిపోకుండా, భారతీయ సంప్రదాయ పద్ధతులనే అనుసరించడం ఆమె సరళతను తెలియజేస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
Go Back to Shorts
Shreya Ghoshal
Hair Secret
Coconut Oil
Singer
Bollywood

More Telugu News