తెలంగాణ రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి... ఉత్తర్వులు జారీ

Telangana Government declares Sri Vasavi Matha Jayanthi as an annual State Function
  • వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • ఏటా వైశాఖ శుక్ల దశమి నాడు అధికారికంగా ఉత్సవాలు
  • ఈ ఏడాది ఏప్రిల్ 26న జయంతి వేడుకలు నిర్వహణ
  • అన్ని జిల్లాల్లో వేడుకలు జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు
  • పర్యాటక, సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించింది. ఇకపై ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న వాసవీ జయంతి రానుండటంతో, ఆ రోజున ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం G.O. Ms. No. 67ను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో వాసవీ మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు నోడల్ ఏజెన్సీగా అప్పగించారు. వేడుకలకు అవసరమైన నిధులను ఆ శాఖ బడ్జెట్ నుంచే కేటాయించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వాసవీ మాత జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జరగనున్నాయి.
Go Back to Shorts
Sri Vasavi Matha Jayanthi
State Function
Congress
Telangana

More Telugu News