నీట్ రీ-ఎగ్జామ్: 'లాక్డౌన్'లోకి పేపర్ తయారుచేసిన నిపుణులు!
- జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్
- గత లీక్ల నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు
- పేపర్ తయారు చేసిన నిపుణుల గృహ నిర్బంధం
- వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
- స్మార్ట్ వాచ్లూ అనుమతించని వైనం
ప్రశ్నపత్రాలు తయారు చేసే నిపుణులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ చేశారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, స్మార్ట్వాచ్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వారు ఉంటున్న రహస్య కేంద్రంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఆ కేంద్రంలోకి ఎవరికీ అనుమతి లేదు. లోపలికి వెళ్లి వచ్చే ప్రతి ఒక్కరి కదలికలను అధికారులు నిరంతరం రికార్డు చేస్తున్నారు
ఈ ఐసోలేషన్ ప్రక్రియ భద్రతా వలయంలో కేవలం మొదటి అంచె మాత్రమేనని అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాల తయారీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రవాణా వరకు ప్రతి దశను అత్యంత కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మొత్తం గొలుసుకట్టు ప్రక్రియలో ఏ ఒక్క వ్యక్తికీ పూర్తి సమాచారం తెలియకుండా వ్యవస్థను విభజించారు. పేపర్ రవాణా కోసం భారత వైమానిక దళం విమానాలను ఉపయోగించే ఆలోచనలో ఉన్నారు.
నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-పేపర్ విధానంలో జరగనుంది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. గత పరీక్షలో జరిగిన లోపాలను పూర్తిగా సరిదిద్ది.. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షను విజయవంతం చేయడం ఎన్టీఏకు సవాలుగా మారింది.