తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు

  • సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు
  • ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
  • జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు

విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వేసవి సెలవుల సందడి తెలంగాణలో మొదలైంది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 23) విద్యా సంవత్సరం అధికారికంగా ముగిసింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలన్నీ వేసవి సెలవుల కారణంగా మూతపడనున్నాయి.


సమ్మర్ హాలిడేస్ షెడ్యూల్:
  • ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 50 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి.

  • జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

  • సాధారణంగా ఏప్రిల్ నెలాఖరు వరకు తరగతులు జరిగేవి, కానీ ఈ ఏడాది ఎండలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ముందస్తుగానే సెలవులు ప్రకటించింది.


Summer Holidays
Telangana
Schools

More Telugu News