ఆర్టీసీ సమ్మె... నర్సంపేటలో నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్

RTC Driver Self Immolates in Narsampet Over Strike
  • రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
  • నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ గౌడ్
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటూ నిప్పంటించుకున్న డ్రైవర్
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఒక కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేడు రెండవ రోజుకు చేరుకుంది. పలుచోట్ల ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై తన శరీరానికి నిప్పంటించుకున్నాడు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ, బస్టాండ్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వరంగల్‌లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Go Back to Shorts
Kola Shankar Goud
RTC strike
Telangana RTC strike
Narsampet
Bus driver suicide attempt
RTC employees protest

More Telugu News