రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

Scott Bessent comments on Russia oil purchase sanctions relaxation
  • రష్యా చమురు కొనుగోళ్లపై నెల రోజుల పాటు ఆంక్షల సడలింపు
  • కొరత ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఆంక్షలు సడలించినట్లు వెల్లడి
  • వివిధ దేశాలు అమెరికాను సంప్రదించాయన్న మంత్రి స్కాట్ బెసెంట్
రష్యా చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను అమెరికా మరోసారి సడలించడంపై ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొరతను ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఈ ఆంక్షలను సడలించినట్లు ఆయన తెలిపారు. సముద్రమార్గంలోని రష్యా చమురును వివిధ దేశాలు కొనుగోలు చేయడానికి అనుగుణంగా నెలరోజుల పాటు మినహాయింపును అమెరికా పొడిగించింది.

ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సమావేశాల సమయంలో ఈ సడలింపులపై తమకు అభ్యర్థనలు వచ్చాయని బెసెంట్ వెల్లడించారు. ఇంధన కొరతను ఎదుర్కొంటున్న పదికి పైగా దేశాలు అమెరికాను సంప్రదించి, రష్యా చమురుపై ఆంక్షలను సడలించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కారణంగానే ఆంక్షల సడలింపును మరో నెల రోజులు పొడిగించినట్లు చెప్పారు.

ఇరాన్‌తో దాదాపు రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్‌ సహా అన్ని దేశాలకు అమెరికా అనుమతినిచ్చింది. తొలుత ఈ మినహాయింపులు పొడిగించమని చెప్పిన అమెరికా, ఆ తర్వాత నెల రోజుల పాటు కొనుగోలుకు ఊరట కల్పించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు రవాణాకు అడ్డంకులు తొలగించడానికి, ధరల స్థిరీకరణకు ఈ చర్యలు తీసుకున్నట్లు బెసెంట్ తెలిపారు.
Go Back to Shorts
Scott Bessent
Russia oil
US sanctions
oil imports
energy crisis
India oil imports
Iran war
global economy
oil prices
energy policy

More Telugu News