డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు: అనంతబాబు బెయిల్ రద్దుకు పిటిషన్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం
- డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ
- 5 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
- సాక్షులను బెదిరించిన వ్యవహారంలో కొత్తగా కేసు నమోదు
- అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్
- కాకినాడ నివాసం నుంచి బైక్‌పై తప్పించుకున్న ఎమ్మెల్సీ
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులను బెదిరించిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కొత్తగా కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు విధించిన బెయిల్ షరతులను అనంతబాబు ఉల్లంఘించారని, ఆయన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో ఆయన పరార్ కాగా, పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రైవర్ హత్య కేసులో తనకు వ్యతిరేకంగా ఉన్న నలుగురు సాక్షులను అనంతబాబు తన అనుచరుల ద్వారా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని, ఇందుకు ప్రతిఫలంగా డబ్బు ఇస్తామని ఒత్తిడి చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు అనంతబాబు సహా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనంతబాబు అనుచరుడొకరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, డ్రైవర్ హత్య కేసు తదుపరి విచారణ శుక్రవారం జరగనుండగా, అనంతబాబు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఒకవేళ హాజరుకాని పక్షంలో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది.