మమతా దీదీ, నేను బీజేపీయే మాంసాహారం తింటాను: నాగాలాండ్ నేత వీడియో
- బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగంపై నిషేధం విధిస్తుందని ఆరోపణ
- మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల కౌంటర్
- హోటల్లో మాంసాహారాన్ని ముందు పెట్టుకుని కౌంటర్ ఇచ్చిన తెమ్జెన్
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగంపై నిషేధం విధిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాగాలాండ్ నాయకుడు తెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను మాంసాహారినేనని, బీజేపీలోనే ఉన్నానని పేర్కొంటూ తన సామాజిక మాధ్యమ వేదికగా ఒక పోస్టు పెట్టారు.
"మమతా దీదీ, నేను బీజేపీలోనే ఉన్నాను మరియు నేను మాంసాహారిని" అంటూ తాను ఒక హోటల్‌లో నాన్-వెజ్ తింటున్న వీడియోను షేర్ చేశారు.
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాల్ ప్రజలు చేపలు, బియ్యం తింటారని, కానీ మీరు చేపలు తినకూడదని చెబితే మరి ఈ ప్రజలు ఏం తినాలని బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఈ ప్రచారాన్ని బీజేపీ ఇప్పటికే ఖండించింది. తాజాగా, తెమ్జెన్ తాను మాంసాహారంతో పాటు ఇతర వంటకాలు ఉన్న ప్లేట్ ముందు పెట్టుకుని తినడానికి సిద్ధంగా ఉన్న వీడియోను షేర్ చేశారు.