ఆర్టీసీ సమ్మె... హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

ఆర్టీసీ సమ్మె... హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

Hyderabad Metro increases services
  • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణాలకు ఇబ్బంది
  • హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు పెంచుతున్నట్లు వెల్లడి
  • రాత్రి 11 గంటల తర్వాత కూడా సర్వీసులను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి
నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయాలకు, పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. దీనితో హైదరాబాద్ మెట్రో సర్వీసులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో సర్వీసులను పెంచుతున్నామని మెట్రో రైలు వెల్లడించింది.

మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్, నాగోల్-రాయదుర్గం కారిడార్‌లలో మెట్రో సేవలను పెంచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులను పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు.

మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో సాధారణంగా పీక్ అవర్‌లో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు, నాన్ పీక్ అవర్లలో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రోజంతా 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలును నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్-రాయదుర్గం కారిడార్‌లో నాన్ పీక్ అవర్‌లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు ఉంటుంది. కానీ ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు నడుపుతున్నట్లు వెల్లడించింది.
Advertisement
Hyderabad Metro
Telangana RTC strike
TGSRTC Strike

More Telugu News