తిరుపతి నుంచి తళ్లికి బస్సు నడపాలన్న తమిళనాడు ఎన్డీయే నేతలు.. వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు

National
Advertisement
  • తమిళనాడులోని తళ్లిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • భాష ఏదైనా మనమంతా ద్రవిడులమేనని సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేశారు
  • మహిళా రిజర్వేషన్ బిల్లును డీఎంకే, కాంగ్రెస్ అడ్డుకున్నాయని విమర్శ
  • గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేసి దక్షిణాదికి న్యాయం చేస్తామని హామీ
  • తమిళనాడు అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పిలుపు
Advertisement
ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణగిరి జిల్లా తళ్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ తరఫున నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. తమిళనాడుకు వచ్చినా తన సొంత గడ్డపై ఉన్న అనుభూతే కలుగుతోందని, ఇక్కడి ప్రజలు చూపుతున్న ఆదరణ ఎంతో ఆనందాన్నిస్తోందని అన్నారు. "మన భాషలు వేరైనా, మనమంతా ద్రవిడులమే. మన మూలాలు, సంస్కృతి ఒక్కటే" అంటూ తమిళ ప్రజలతో ఉన్న సాంస్కృతిక బంధాన్ని బలంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్డీఏ నేతలు తళి నుంచి తిరుపతికి బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని కోరగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపారు.

చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ, "ఎన్నో దాడులు జరిగినా తమిళ సంస్కృతి తన ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకుంది. ఎన్టీఆర్ సినీ జీవితం కూడా తమిళ గడ్డ మీద నుంచే మొదలైంది. రెండు రాష్ట్రాల సరిహద్దులోని చిత్తూరు నుంచే నేను వచ్చాను. చెన్నై దాహార్తిని తీర్చడానికి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇచ్చారు. మనం అన్నదమ్ముల్లా కలిసి అభివృద్ధి చెందుతున్నాం" అని చంద్రబాబు వివరించారు. ఏపీలోని తిరుపతికి తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, ఈ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు.

అనంతరం జాతీయ రాజకీయాలు, డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు దూసుకెళ్తోందని ప్రశంసించారు. "భారత్‌ను ప్రపంచ పటంలో గౌరవప్రదమైన స్థానంలో నిలిపిన ఘనత మోదీదే. ఆయన 'వికసిత్ భారత్' కోసం స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నారు. కానీ తమిళుల, దేశ ప్రయోజనాలు పట్టని కొన్ని పార్టీలు ఇక్కడ ఉన్నాయి" అని డీఎంకే, కాంగ్రెస్‌లను ఉద్దేశించి అన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ, "మహిళలకు సమాజంలో సమాన గౌరవం కల్పించేందుకు మోదీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తే కాంగ్రెస్, డీఎంకే పార్టీలు దానిని అడ్డుకున్నాయి. ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోంది. మహిళా బిల్లును అడ్డుకుని వారేం సాధించారు? గతంలోనూ కాంగ్రెస్ ఇదే బిల్లుకు సహకరించలేదు. క్రెడిట్ మీరే తీసుకోండని ప్రధాని చెప్పినా ఈ పార్టీలు బిల్లును ఓడించాయి. దీనిపై డీఎంకే సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు.

తమిళనాడులో పాలన గాడి తప్పిందని, రాష్ట్రం అన్ని అంశాల్లో వెనుకబడిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. "డీఎంకే పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. శాంతిభద్రతలు క్షీణించాయి. డ్రగ్స్, మహిళలపై దాడులు, కస్టోడియల్ మరణాలు పెరిగాయి. మద్యం ధరలు పెంచి డీఎంకే ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటోంది" అని విమర్శించారు. తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఏపీలో గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని 22 నెలల్లోనే వికాసం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. 

"గోదావరి నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. గంగ-కావేరి కలవాలి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను" అని హామీ ఇచ్చారు. అభివృద్ధి, ఉద్యోగాల కోసం కేంద్ర సహకారం అవసరమని, జయలలిత స్ఫూర్తితో అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఎన్డీఏకు వేసే ప్రతి ఓటు తమిళనాడు భవిష్యత్తును గెలిపిస్తుందని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

ChandrababuTamil Nadu Assembly ElectionsThallyNDAAIADMKBJPTDPTirupatiAndhra Pradesh

More Telugu News

రేపే ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

04 Nov, 12:04

హిందూ-యూదుల బంధంతో ముస్లింలకు ముప్పట.. భారత్‌-ఇజ్రాయెల్‌ దోస్తీపై పాక్‌ అక్కసు!

04 Nov, 12:03

హ్యాపీనెస్ ఆల్వేస్.. టబుకు జాకీ ష్రాఫ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

04 Nov, 12:00

వివేక్ రామస్వామికి వివాదాస్పద యాడ్ దెబ్బ.. ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడి బెడిసికొట్టింది!

04 Nov, 11:57

ఫీల్డింగ్‌లో రో-కో మెరుపులు.. కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌.. రోహిత్‌ అదిరిపోయే రనౌట్‌!

04 Nov, 11:41

భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల.. తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్

04 Nov, 11:29

పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి: కవిత

04 Nov, 11:21

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు ఐఫోన్ 16.. ఢిల్లీ కంపెనీపై ప్రశంసల వర్షం!

04 Nov, 11:20

గాయకుడిగా సల్మాన్.. 'తేరి సెక్సీ బ్యూటీ' సాంగ్ రిలీజ్

04 Nov, 11:19

ఏపీలో రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... పోలింగ్ జరుగుతుందా?

04 Nov, 11:13

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా? రేడియేషన్‌ ఎక్కడి వరకు వస్తుంది?

04 Nov, 11:12

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు

04 Nov, 11:09

రైలు వెళ్లిన కాసేపటికే పట్టాలపై పేలుడు.. అదీ భారత్‌-పాక్‌ సరిహద్దుకు కొంత దూరంలో..!

04 Nov, 11:08

ధన త్రయోదశి షాక్.. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు!

04 Nov, 10:57

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

04 Nov, 10:54
..More Telugu News