అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్!

Entertainment
Advertisement
  • ఇన్స్టా వేదికగా సినీ నటి అనసూయపై అసభ్యకర పోస్టులు
  • టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు
  • అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన వైనం
Advertisement

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించి ఒక నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ పోలీసులను ఆశ్రయించారు. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటి అని గుర్తించి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఈ కేసు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు నెటిజన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను ఇతరులను దూషించడానికి లేదా వేధించడానికి వాడితే ఐటీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వేధింపులను భరించకుండా అనసూయ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం పట్ల సినీ వర్గాలు, నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

సంబంధిత వార్తలు

AnasuyaTollywood

More Telugu News

రేపే ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

04 Nov, 12:04

హిందూ-యూదుల బంధంతో ముస్లింలకు ముప్పట.. భారత్‌-ఇజ్రాయెల్‌ దోస్తీపై పాక్‌ అక్కసు!

04 Nov, 12:03

హ్యాపీనెస్ ఆల్వేస్.. టబుకు జాకీ ష్రాఫ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

04 Nov, 12:00

వివేక్ రామస్వామికి వివాదాస్పద యాడ్ దెబ్బ.. ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడి బెడిసికొట్టింది!

04 Nov, 11:57

ఫీల్డింగ్‌లో రో-కో మెరుపులు.. కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌.. రోహిత్‌ అదిరిపోయే రనౌట్‌!

04 Nov, 11:41

భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల.. తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్

04 Nov, 11:29

పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి: కవిత

04 Nov, 11:21

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు ఐఫోన్ 16.. ఢిల్లీ కంపెనీపై ప్రశంసల వర్షం!

04 Nov, 11:20

గాయకుడిగా సల్మాన్.. 'తేరి సెక్సీ బ్యూటీ' సాంగ్ రిలీజ్

04 Nov, 11:19

ఏపీలో రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... పోలింగ్ జరుగుతుందా?

04 Nov, 11:13

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా? రేడియేషన్‌ ఎక్కడి వరకు వస్తుంది?

04 Nov, 11:12

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు

04 Nov, 11:09

రైలు వెళ్లిన కాసేపటికే పట్టాలపై పేలుడు.. అదీ భారత్‌-పాక్‌ సరిహద్దుకు కొంత దూరంలో..!

04 Nov, 11:08

ధన త్రయోదశి షాక్.. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు!

04 Nov, 10:57

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

04 Nov, 10:54
..More Telugu News