నాన్నకు మంత్రి లోకేశ్ బర్త్‌డే విషెస్.. మీ నుంచి నేర్చుకోవడం నా అదృష్టం అంటూ భావోద్వేగ పోస్ట్
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
- ఆయన్ని 'నాన్న' అని పిలవడం నా అదృష్టం అంటూ 'ఎక్స్'లో పోస్ట్
- ప్రజాసేవ పట్ల చంద్రబాబు అభిరుచి ఏటేటా బలపడుతోందన్న లోకేశ్
- ఆయన ఆలోచనా స్పష్టత, నిబద్ధత తనకు మార్గనిర్దేశం చేస్తాయని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన తండ్రికి ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా, భావోద్వేగభరితంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
"గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్ఫూర్తిదాయకమైన నాయకుడైన ఆయన్ని 'నాన్న' అని పిలిచే అదృష్టం నాకు దక్కింది" అని లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "సంవత్సరాలు గడిచేకొద్దీ ప్రజాసేవ పట్ల మీ అభిరుచి మరింత బలపడుతోంది. మీ అనుభవం, వివేకం.. పునరుత్తేజంతో కూడిన శక్తితో మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాయి" అంటూ తండ్రి నాయకత్వ పటిమను ప్రశంసించారు.
"ప్రతిరోజూ మీ నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఆలోచనా స్పష్టత, పట్టుదల, ప్రజల పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధత నాకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తాయి. మీకు సంపూర్ణ ఆరోగ్యం, శక్తి కలగాలని, మరెన్నో ఏళ్లు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించాలని కోరుకుంటున్నాను" అని లోకేశ్ తన పోస్టులో ఆకాంక్షించారు.
మావయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: నారా బ్రాహ్మణి
కోడలు నారా బ్రాహ్మణి కూడా చంద్రబాబుకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. చంద్రబాబుకు సంతోషం, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. "మావయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! ప్రజా సేవ పట్ల మీకున్న అభిరుచిని, ఆంధ్రప్రదేశ్ పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధతను చూస్తుంటే మా హృదయాలు గర్వంతో నిండిపోతున్నాయి. మా కుటుంబానికి నిరంతరం ప్రోత్సాహాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ అద్భుతమైన నాయకత్వ ప్రయాణాన్ని కొనసాగించడానికి మీకు సంతోషం, మంచి ఆరోగ్యం, అంతులేని శక్తి కలగాలని కోరుకుంటున్నాను"అని బ్రాహ్మణి ట్వీట్ చేశారు.