వివాహేతర సంబంధాల్లో దారుణం: ఒకచోట భర్తను చంపించిన భార్య.. మరోచోట ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు

Telangana
Advertisement
  • వరంగల్‌లో రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య
  • కామారెడ్డిలో అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు
  • రెండు ఘటనల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement
వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అడ్డుగా ఉన్నారనే కారణంతో కట్టుకున్న భర్తను, కన్న కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన రెండు వేర్వేరు ఘటనలు తెలంగాణలో వెలుగుచూశాయి. వరంగల్‌లో భార్యే సుపారీ ఇచ్చి భర్తను చంపించగా, కామారెడ్డిలో ప్రియురాలి కొడుకును ఆమె ప్రియుడు హతమార్చాడు.

వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సుమన్‌ భరత్‌ (38) ఈ నెల 8న కనపడటం లేదని అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. సుమన్‌ భరత్‌ భార్య లావణ్యకు నరేశ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై భర్త తాగి వచ్చి వేధించడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. 

ప్రియుడు, తమ్ముడితో కలిసి రూ.5 లక్షలకు సుపారీ మాట్లాడుకుని, తన బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు సమకూర్చింది. ప్లాన్ ప్రకారం హంతకులు ఈ నెల 3న సుమన్‌ భరత్‌కు మద్యం తాగించి, బీర్ బాటిల్‌తో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. హత్యను వీడియో తీసి లావణ్యకు చూపించి మిగిలిన డబ్బులు తీసుకున్నారు. ఈ కేసులో లావణ్యతో పాటు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇలాంటిదే మరో దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్న నర్సింలు, తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె ఐదేళ్ల కుమారుడు శ్రావణ్‌ను హత్య చేశాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో బాలుడి కళ్లలో కారం చల్లి, కర్రతో తలపై కొట్టి చంపాడు. ఈ హత్యకు బాలుడి తల్లి కూడా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Extra marital affairsWarangal CrimeKamareddy CrimeTelangana CrimeMurder for affairHusband MurderSon MurderSupari Killing

More Telugu News

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10

కంగ్రాట్స్ చంద్రబాబు టీమ్!: జగన్

03 Nov, 19:31

అన్ని అపోహలు పటాపంచలు.. సౌర తుపానుల గుట్టు విప్పిన ఆదిత్య-ఎల్1

03 Nov, 19:14

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా

03 Nov, 19:07

ఏపీ పురపోరు.. క్లీన్ స్వీప్ దిశగా కూటమి.. లేటెస్ట్ ట్రెండ్స్ ఇవిగో!

03 Nov, 18:57

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. జగన్ విధ్వంసానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు: పెమ్మసాని

03 Nov, 18:42

వంట వస్తేనే పెళ్లి.. భార్య రితికాపై చేసిన ప్రాంక్‌ను బయటపెట్టిన రోహిత్ శర్మ!

03 Nov, 17:56

ట్రంప్‌కు అగ్నిపరీక్ష.. అమెరికాలో మొదలైన మధ్యంతర ఎన్నికల పోలింగ్

03 Nov, 17:50

స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. ఇది సుపరిపాలనకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు

03 Nov, 17:29
..More Telugu News