క్షిపణి పరీక్షల కోసం ఒకేసారి 'నోటమ్' జారీ చేసిన భారత్, పాకిస్థాన్
- అరేబియా సముద్రంలో క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడి
- ఈ నెల 20 నుంచి 21 వరకు పాకిస్థాన్ నోటమ్ జారీ
- ఈ నెల 22 నుంచి 25 వరకు భారత్ నోటమ్ జారీ
అరేబియా సముద్రంలో క్షిపణి విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు భారత, పాకిస్థాన్ దేశాలు ఒకేసారి నోటమ్ (నోటీసెస్ టు ఎయిర్‌మెన్) జారీ చేశాయి. క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇరుదేశాలు తెలిపాయి. సముద్రంపై సైనిక విన్యాసాల సమయంలో నిర్దేశించిన జోన్‌లకు పౌర విమానాలు, నౌకలు దూరంగా ఉండాలని ఆయా దేశాలు నోటమ్, మారిటైమ్ అడ్వైజరీ వంటివి జారీ చేయడం సహజమే. అయితే ఇప్పుడు రెండు దేశాలు ఒకేసారి నోటమ్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ 20 తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు పౌర విమానాలు, నౌకలు దూరంగా ఉండాలని పాకిస్థాన్ నోటమ్ జారీ చేసింది. 200 కిలోమీటర్ల మేర క్షిపణి విన్యాసాల జోన్‌గా పాకిస్థాన్ ప్రకటించింది.
అలాగే భారత్ కూడా ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏప్రిల్ 25న రాత్రి 9.30 గంటల వరకు సుదీర్ఘ విన్యాసాలకు హెచ్చరికలు జారీ చేసింది. భారత్ 400 కిలోమీటర్ల మేర క్షిపణుల విన్యాసం కోసం జోన్‌గా ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ జరిగిన సంవత్సరం తర్వాత ఇరుదేశాలు ఆయుధ పరీక్షలపై ప్రకటన చేయడం గమనార్హం.