ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌కు బాంబు బెదిరింపు

Uppal Metro Station Receives Bomb Threat in Hyderabad
  • మెట్రో స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
  • పోలీసులకు సమాచారం అందించిన మెట్రో సిబ్బంది
  • తనిఖీలు నిర్వహించగా లభ్యం కాని అనుమానాస్పద వస్తువులు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మెట్రో స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మెట్రో రైలు స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మెట్రో రైలు స్టేషన్‌లో ఎలాంటి బాంబు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. ఫోన్ చేసిన నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తి ఎవరో ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Go Back to Shorts
Uppal Metro Station
Hyderabad Metro
Bomb Threat
Metro Station Security
Bomb Squad

More Telugu News