రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది: జీవన్ రెడ్డి

  • ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శ
  • కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ కాదన్న జీవన్ రెడ్డి
  • కేసీఆర్‌కు ప్రజలు అంటే గౌరవం ఉందని వ్యాఖ్య
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడని అన్నారు.

కేసీఆర్ తన వయసును గౌరవించి 'అన్న' అని పిలుస్తారని తెలిపారు. కేసీఆర్‌కు ప్రజలంటే గౌర‌వం ఉందని, ఆయన రేవంత్‌ రెడ్డి లాంటి వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. తాను బీఆర్ఎస్‌ పార్టీలో చేరడంపై స్పందిస్తూ, ఆఖరి వరకు ప్రజల కోసమే పోరాడతానని స్పష్టం చేశారు. సాధారణంగా పార్టీ సూచనలను బట్టి ప్రభుత్వం నడుస్తుందని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వం సూచన మేరకు పార్టీ నడుస్తుందని విమర్శించారు.

Revanth Reddy
Jeevan Reddy
Congress Party
Telangana Congress
BRS Party
KCR
Telangana Politics

More Telugu News