యూఏఈ దెబ్బ.. నిధుల సమీకరణకు పాకిస్థాన్ పరుగులు

International
Advertisement
  • 3 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంట‌నే చెల్లించాలని పాక్‌ను కోరిన యూఏఈ
  • ఏడేళ్లలో తొలిసారిగా రుణాన్ని పునరుద్ధరించుకోవడంలో విఫలమైన పాక్
  • పెరుగుతున్న చమురు ధరలతో మరింత ఒత్తిడిలోకి పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ
  • ఇతర దేశాలు, బ్యాంకుల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు
Advertisement
ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు యూఏఈ గట్టి షాక్ ఇచ్చింది. తాము గతంలో ఇచ్చిన 3 బిలియన్ డాలర్ల రుణాన్ని తక్షణమే పూర్తిగా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. గత ఏడేళ్లలో తొలిసారిగా ఈ రుణాన్ని పునరుద్ధరించుకునే (రోలోవర్) ఒప్పందం కుదరకపోవడంతో పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడింది. ఇదే సమయంలో ప‌శ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరగడం పాక్‌కు మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిధుల కొరతను అధిగమించేందుకు ఇతర దేశాలు, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ తెలిపారు. వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు స్ప్రింగ్ మీటింగ్స్ సందర్భంగా ఆయన బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. "నిధుల కోసం మేం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. వాణిజ్యపరమైన రుణాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు రెండింటినీ పరిశీలిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆర్థిక సహాయం కోసం చైనా, సౌదీ అరేబియాతో చర్చలు జరుపుతున్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

ప్రస్తుతం పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు మార్చి 27 నాటికి 16.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇవి కేవలం మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. అయినప్పటికీ, రుణదాతలకు తిరిగి చెల్లించే సామర్థ్యం తమకు ఉందని ఔరంగజేబ్ ధీమా వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లోకి తిరిగి ప్రవేశం 
నాలుగేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది అంతర్జాతీయ బాండ్ మార్కెట్లలోకి తిరిగి ప్రవేశించాలని పాకిస్థాన్ యోచిస్తోంది. ఇందులో భాగంగా యూరోబాండ్లు, ఇస్లామిక్ సుకుక్ బాండ్లు, డాలర్-సెటిల్డ్ రూపాయి-లింక్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు ఔరంగజేబ్ తెలిపారు. అంతేగాక‌ చైనా కరెన్సీ యువాన్‌తో జారీ చేసే "పాండా బాండ్ల"ను కూడా తొలిసారిగా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సహకారంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 250 మిలియన్ డాలర్ల విలువైన పాండా బాండ్లను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే... అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా అందాల్సిన తదుపరి విడత నిధుల కోసం పాకిస్థాన్ ఎదురుచూస్తోంది. ఈ నిధులు ఆమోదం పొందితే సుమారు 1.3 బిలియన్ డాలర్లు అందుబాటులోకి వస్తాయి. చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఐఎంఎఫ్ నుంచి అదనపు సహాయం కోరడం లేదని, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని ఔరంగజేబ్ స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

PakistanPakistan economyUAE loanIMF bailoutMuhammad AurangzebForeign reservesPanda bondsEurobondsSukuk bondsChina

More Telugu News

అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీపైనే విమర్శలా?: నిర్మాత ఎస్కేఎన్

04 Nov, 16:27

3,800 ఏళ్ల నాటి లేఖ రహస్యం.. మట్టి కవర్‌ను తెరవకుండానే చదివిన పరిశోధకులు!

04 Nov, 16:14

ఏఐపై భారతీయుల్లో ఆశావాదం.. అమెరికన్లలో మాత్రం నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

04 Nov, 16:09

వంగవీటి రాధా గెలుపు చరిత్రాత్మకం: కేశినేని చిన్ని

04 Nov, 16:04

భూమి వైపు దూసుకొస్తున్న నాసా స్పేస్‌ టెలిస్కోప్‌.. భారత్‌లోనూ శకలాలు పడే అవకాశం!

04 Nov, 16:02

గుమ్మంలో దీపం, చేతిలో లీకైన సిలిండర్.. క్షణాల్లో అంటుకున్న మంటలు.. వైరల్ వీడియో!

04 Nov, 15:55

మేయర్‌గా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు: వంగవీటి రాధా

04 Nov, 15:42

అగ్నివీరులకు మరో రెండేళ్లు సర్వీసు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం

04 Nov, 15:41

ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నేతలు వణికిపోతున్నారు: కేటీఆర్‌ ఘాటు విమర్శలు

04 Nov, 15:37

కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో కివీస్‌పై భారత్ ఘనవిజయం

04 Nov, 15:32

ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ కైవసం.. 37 వేల ఓట్ల భారీ మెజారిటీతో శ్రీశిల్ప ఘన విజయం

04 Nov, 15:30

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: మంత్రి పొన్నం

04 Nov, 15:13

ప్రజల కడుపు మాడుతున్నా.. సైనిక ఖర్చులకే పాకిస్థాన్ పెద్దపీట!

04 Nov, 15:08

ఇది సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతికి ప్రతిబింబం: అల్లు అర్జున్

04 Nov, 15:03

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. సీఎం చంద్రబాబును కలిసిన పల్లా

04 Nov, 15:03
..More Telugu News