ఎదుర్కొన్న తొలి బంతికే వైభ‌వ్ గోల్డెన్ డకౌట్‌.. కావ్య మార‌న్‌ వైల్డ్ సెల‌బ్రేష‌న్స్‌ చూశారా?

Sports
Advertisement
  • ఉప్పల్ మ్యాచ్‌లో వైరల్ అయిన కావ్య మారన్ రియాక్షన్
  • తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన యువ బ్యాటర్ వైభవ్
  • వికెట్ పడటంతో స్టాండ్స్‌లో ఎగిరి గంతేసిన సన్‌రైజర్స్ ఓనర్
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సెలబ్రేషన్ వీడియో
Advertisement
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మరోసారి తన హావభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆట పట్ల ఆమెకున్న ఆసక్తి, జట్టు పట్ల చూపే ఎమోషన్స్‌తో కావ్య తరచూ వార్తల్లో ఉంటారు. తాజాగా ఆమె వైల్డ్‌ రియాక్షన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివరాల్లోకి వెళితే... సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రఫుల్ హింగే వేసిన బౌన్సర్‌ను భారీ షాట్ ఆడేందుకు వైభవ్ ప్రయత్నించగా, బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది.

ఆ సమయంలో స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న కావ్య మారన్ తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. వెంటనే తన సీటులోంచి లేచి నిలబడి "క్యాచ్.. క్యాచ్.." అంటూ అరిచారు. వికెట్ కీపర్ సలీల్ అరోరా ఆ క్యాచ్‌ను అందుకోగానే, కావ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టాండ్స్‌లోనే గంతులు వేస్తూ ఆ వికెట్‌ను ఆస్వాదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కావ్య మార‌న్ వైల్డ్ సెల‌బ్రేష‌న్స్‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Kavya MaranSunrisers HyderabadSRHRajasthan RoyalsIPL 2024Vaibhav SuryavanshiGolden DuckViral VideoCricketUppal Stadium

More Telugu News

వరుసగా ఐదో రోజూ లాభాల జోరు.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

04 Nov, 16:30

అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీపైనే విమర్శలా?: నిర్మాత ఎస్కేఎన్

04 Nov, 16:27

3,800 ఏళ్ల నాటి లేఖ రహస్యం.. మట్టి కవర్‌ను తెరవకుండానే చదివిన పరిశోధకులు!

04 Nov, 16:14

ఏఐపై భారతీయుల్లో ఆశావాదం.. అమెరికన్లలో మాత్రం నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

04 Nov, 16:09

వంగవీటి రాధా గెలుపు చరిత్రాత్మకం: కేశినేని చిన్ని

04 Nov, 16:04

భూమి వైపు దూసుకొస్తున్న నాసా స్పేస్‌ టెలిస్కోప్‌.. భారత్‌లోనూ శకలాలు పడే అవకాశం!

04 Nov, 16:02

గుమ్మంలో దీపం, చేతిలో లీకైన సిలిండర్.. క్షణాల్లో అంటుకున్న మంటలు.. వైరల్ వీడియో!

04 Nov, 15:55

మేయర్‌గా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు: వంగవీటి రాధా

04 Nov, 15:42

అగ్నివీరులకు మరో రెండేళ్లు సర్వీసు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం

04 Nov, 15:41

ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నేతలు వణికిపోతున్నారు: కేటీఆర్‌ ఘాటు విమర్శలు

04 Nov, 15:37

కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో కివీస్‌పై భారత్ ఘనవిజయం

04 Nov, 15:32

ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ కైవసం.. 37 వేల ఓట్ల భారీ మెజారిటీతో శ్రీశిల్ప ఘన విజయం

04 Nov, 15:30

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: మంత్రి పొన్నం

04 Nov, 15:13

ప్రజల కడుపు మాడుతున్నా.. సైనిక ఖర్చులకే పాకిస్థాన్ పెద్దపీట!

04 Nov, 15:08

ఇది సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతికి ప్రతిబింబం: అల్లు అర్జున్

04 Nov, 15:03
..More Telugu News