వైభవ్ సూర్యవంశీ డకౌట్... 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్... సన్ రైజర్స్ బౌలర్ హింగే అద్భుతం

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్లు సృష్టించిన ఉప్పెనకు రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ కుప్పకూలింది. 217 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ కేవలం 3 ఓవర్లలో 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అరంగేట్రం చేసిన యువ పేసర్ ప్రఫుల్ హింగే తన మ్యాజికల్ బౌలింగ్‌తో రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ (0), ధ్రువ్ జురెల్ (0), ప్రిటోరియస్‌ (0)లను పెవిలియన్ చేర్చి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. మరోవైపు, ఇంకో అరంగేట్ర బౌలర్ సాకిబ్ హుస్సేన్ ప్రమాదకర యశస్వి జైస్వాల్ (1)ను ఔట్ చేశాడు. అనంతరం తన రెండో ఓవర్లో హింగే.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ (4)ను కూడా ఔట్ చేసి నాలుగో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ శిబిరం పూర్తిగా డీలా పడిపోయింది.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు హెన్రిచ్ క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28) మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్యఛేదనలో ఆరంభంలోనే టాప్ ఆర్డర్‌ను కోల్పోయిన రాజస్థాన్ ఓటమి అంచుల్లో నిలిచింది.

Praful Hinge
Sunrisers Hyderabad
Rajasthan Royals
IPL 2024
Vaibhav Suryavanshi
Sakib Hussain
Riyan Parag
Rajiv Gandhi International Stadium
Ishan Kishan

More Telugu News