మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రైజ్ మనీ ఎంత పెరిగిందంటే?
రానున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల (87,64,615 డాలర్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది. 12 జట్లతో జరిగే ఈ టోర్నమెంట్ 2026 జూన్-జూలైలో ఇంగ్లాండ్‌లో జరగనుంది. 2024లో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన గత టోర్నమెంట్‌తో పోలిస్తే ఈ ప్రైజ్ ఫండ్ 10 శాతం అధికం. 2024 ఎడిషన్‌లో రూ.70 కోట్ల (79,58,077 డాలర్లు) నగదు బహుమతిని ప్రకటించారు.
న్యూజిలాండ్ గెలిచిన గత టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొనగా, రాబోయే మహిళా టీ20 ప్రపంచ కప్‌లో మరో రెండు జట్లు జత కలుస్తున్నాయి.
ఈసారి విజేతగా నిలిచిన జట్టు రూ.21.8 కోట్లు, రన్నరప్ రూ.10 కోట్లు గెలుచుకోనున్నాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ.6 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు అందజేస్తారు. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు (గ్యారెంటీ మనీ) కనీస హామీగా రూ.2.3 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.