తోబుట్టువుల దినోత్సవం... చెల్లికి, ఆనంద్ దేవరకొండకు విషెస్ తెలిపిన రష్మిక

Rashmika Mandanna Celebrates Siblings Day with Sister Shimann and Anand Deverakonda
షార్ట్స్‌లో చూడండి
స్టార్ నటి రష్మిక మందన్న తన కుటుంబ బంధాలను మరోసారి అభిమానులతో పంచుకున్నారు. 'సిబ్లింగ్స్ డే' (తోబుట్టువుల దినోత్సవం) సందర్భంగా తన చెల్లి షిమాన్ మందన్న, మరిది ఆనంద్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన తర్వాత వస్తున్న ఈ ఫ్యామిలీ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మొదట తన చెల్లి షిమాన్‌తో ఉన్న ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. "ఈ రోజు సిబ్లింగ్స్ డే అంట కదా..." అనే క్యాప్షన్‌ను దానికి జోడించారు. ఆ తర్వాత, తన భర్త విజయ్ దేవరకొండ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండతో ఉన్న మరో ఫోటోను కూడా షేర్ చేసుకుని, తన కొత్త కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు.

రష్మికకు, ఆనంద్‌కు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఏప్రిల్ 5న రష్మిక 30వ పుట్టినరోజు సందర్భంగా ఆనంద్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు వదినా... నీ నవ్వు, పట్టుదల ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నీకు ఎప్పుడూ అండగా ఉంటాను" అని పోస్ట్ చేశారు.

ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను రష్మిక తన స్వస్థలం కూర్గ్‌లో జరుపుకున్నారు. పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో, చిన్ననాటి గుడిని, తాను చదువుకున్న పాఠశాలను సందర్శించి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకను జరుపుకుని ఆనందంగా గడిపారు.
Go Back to Shorts
Rashmika Mandanna
Siblings Day
Anand Deverakonda
Shimann Mandanna
Vijay Deverakonda
Family photos
Tollywood
Kurg
Birthday celebrations

More Telugu News