విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు

Indian Aviation Industry Receives Order to Reduce Landing and Parking Charges
షార్ట్స్‌లో చూడండి
దేశీయ విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం మేర తగ్గించుకోవాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలకు మూడు నెలల పాటు ఈ తగ్గింపులు అందించాలని సూచించింది. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో, దేశీయ విమాయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా సంస్థలు భారీ నష్టాలు చవిచూశాయి.

దీనితో, విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని ఛార్జీలను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని కేంద్రాన్ని కోరాయి. ఈ క్రమంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
Go Back to Shorts
Indian Aviation Industry
Aviation Industry
Airline Landing Charges
Airline Parking Charges
AERA

More Telugu News