Sharwanand: దూసుకెళుతున్న 'బైకర్'... థియేటర్‌లో స్క్రీన్ కు సాష్టాంగ ప్రమాణం చేసిన శర్వా... వీడియో వైరల్

Sharwanand Prostrates Before Screen for Biker Movie Success
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం 'బైకర్'కు లభిస్తున్న ఆదరణ చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌తో ఆనందంలో మునిగిపోయిన ఆయన, థియేటర్‌లోని వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, శర్వానంద్ హీరోగా, సీనియర్ నటుడు డా. రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన 'బైకర్' చిత్రం ఏప్రిల్ 3న విడుదలైంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమాను వీక్షించింది.

హౌస్‌ఫుల్ థియేటర్‌లో ప్రేక్షకుల కేరింతలు, స్పందన చూసిన శర్వానంద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా పూర్తయిన అనంతరం, స్క్రీన్ ముందుకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తన కెరీర్‌కు జీవం పోసిన సినిమాకు, దానిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ విధంగా ఆయన గౌరవం తెలిపారు. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం శర్వానంద్ దాదాపు 22 కిలోల బరువు తగ్గడం గమనార్హం. ఇది తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రమని ఆయన ఇటీవల పేర్కొన్నారు.
Go Back to Shorts
Sharwanand
Biker Movie
Telugu Cinema
Rajasekhar
Abhilash Reddy
Motocross Racing
Sri Ramulu Theatre
Hyderabad
Telugu Movies 2024
Biker Review

More Telugu News