Revanth Reddy: బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలి: రేవంత్ రెడ్డి

బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 6వ తేదీన రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని సూచించారు.

భవిష్యత్తు అవసరాలు, రద్దీ దృష్ట్యా విశాలమైన రోడ్లు ఉండేలా చూడాలని అన్నారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ వాహనాలు ఉపయోగించేలా చూడాలని పేర్కొన్నారు. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. 


Revanth Reddy
Basara Temple
Telangana
Temple Development
Master Plan
Political Activities

More Telugu News