Lokesh: ప్రియురాలితో కలిసి వెళ్లి ఓయో గదిలో యువకుడి ఆత్మహత్య.. కేపీహెచ్ బీలో ఘటన!

ప్రియురాలితో కలిసి ఓయో రూమ్ కు వెళ్లిన ఓ యువకుడు ఆ గదిలోనే ఉరి వేసుకున్నాడు. ఆకలిగా ఉంది టిఫిన్ తీసుకురమ్మంటూ ప్రియురాలిని బయటకు పంపి ఈ దారుణానికి పాల్పడ్డాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఉరివేసుకుని మరణించిన ఈ విషాద ఘటన కేపీహెచ్ బీలోని ఓ ఓయో గదిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన వనమాల లోకేశ్, తాను ప్రేమించిన అంబికతో కలిసి అడ్డగుట్టలోని ఓ ఓయో గదిని అద్దెకు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆకలిగా ఉందని, టిఫిన్ తీసుకురావాలని అంబికను బయటకు పంపాడు. ఆమె తిరిగి వచ్చి చూసేసరికి గదికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో, హోటల్ సిబ్బంది సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా, లోకేశ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.

లోకేశ్ కొంతకాలంగా చింతల్ గణేష్ నగర్‌లో నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. గతంలో పనిచేసిన చోట అంబికతో పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహానికి పచ్చజెండా ఊపారు. పెళ్లికి అన్ని అడ్డంకులు తొలగిపోయిన ఈ తరుణంలో లోకేశ్ ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడనేది మిస్టరీగా మారింది. ఆత్మహత్యకు ముందు లోకేశ్ తన స్నేహితుడికి వాట్సాప్‌లో ‘మిస్ యూ బాయ్’ అని మెసేజ్ పంపి, తన లొకేషన్‌ను షేర్ చేసినట్లు తెలిసింది.

లోకేశ్ సోదరుడు ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంబికతో పాటు ఇరు కుటుంబ సభ్యులను విచారిస్తూ, ఆత్మహత్యకు దారితీసిన కారణాలను శోధిస్తున్నారు.
Lokesh
OYO room suicide
KPHB
Anantapur
Ambika
love affair
marriage
suicide case
Telangana
crime news

More Telugu News