Chowdeswari: మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్

మాచర్ల పరువు హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే కుమార్తె చౌడేశ్వరి(23)ని హత్య చేసిన ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. కూతురి ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగిస్తే భారీగా డబ్బు ఇస్తామని ఆ అధికారికి మృతురాలి తండ్రి ఆఫర్ ఇచ్చినట్లు, ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. రెండు విడతలుగా సదరు అధికారికి డబ్బులు కూడా ముట్టజెప్పినట్లు సమాచారం.

ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి, నాగరాజు దంపతులు నరసరావుపేటలో ఖాజా అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. వారి ఆచూకీ కోసం గాలించిన నరసరావుపేట రూరల్ పోలీసులు ఖాజాను విచారించడంతో విషయం బయటపడింది. వెంటనే మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని జంటను అదుపులోకి తీసుకున్నారు.

తాను మేజర్‌నని, భర్త నాగరాజుతోనే జీవిస్తానని చౌడేశ్వరి స్పష్టంగా చెప్పినప్పటికీ, డీల్ కుదుర్చుకున్న అధికారి ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాతే ఆమె హత్యకు గురైంది. ఆశ్చర్యకరంగా చౌడేశ్వరి హత్యకు గురైన రోజు ఆ అధికారి సెలవులో ఉన్నారు. అనంతరం పోస్టుమార్టం నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, కానీ అది విఫలం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. 
Chowdeswari
Macherla honor killing
Andhra Pradesh honor killing
Narasaraopet
Love marriage murder
Police involvement
Crime news
Chowdeswari murder case
Naguraju
Khaja

More Telugu News