Yuvraj Singh: సన్‌రైజర్స్ కెప్టెన్సీపై చర్చ.. నాకు కూడా ఇలాగే జరిగిందంటూ ధోనీ విషయాన్ని గుర్తుచేసిన యువీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించింది. ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. చాలాకాలంగా జట్టుతో కొనసాగుతున్న యువ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించినప్పటికీ, ఫ్రాంచైజీ యాజమాన్యం ఇషాన్ వైపు మొగ్గు చూపింది. ఈ నిర్ణయం పట్ల టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ తన అసంతృప్తిని, నిరాశను బహిరంగంగా వ్యక్తం చేశాడు.
అభిషేక్ శర్మకు కొన్నేళ్లుగా నెట్స్‌లో శిక్షణ ఇస్తున్న యువరాజ్ సింగ్, అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడం సరైంది కాదన్నాడు. స్పోర్ట్స్ తక్‌తో యువీ మాట్లాడుతూ... "ఈ నిర్ణయం నన్ను కాస్త నిరాశపరిచింది. ఇషాన్ కిషన్ ఎదుగుదల అంటే నాకూ ఇష్టమే. కానీ, ఒక ఆటగాడి కోణంలో ఆలోచించండి. అభిషేక్ శర్మ ఏడేళ్లుగా ఒకే ఫ్రాంచైజీకి తన సర్వస్వాన్ని అందిస్తున్నాడు. తన రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ, ఆ జట్టును గెలిపించాడు. అలాంటి ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వకపోతే, అతను ఎలాంటి మానసిక స్థితితో ఆడతాడు?" అని యువరాజ్ ప్రశ్నించాడు. అయితే, ఇషాన్, అభిషేక్ మధ్య మంచి స్నేహం ఉండటం ఈ ఎదురుదెబ్బ నుంచి కోలుకోవడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా యువరాజ్ తన కెరీర్‌లోని ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. "2007లో భారత జట్టులో నేను వైస్-కెప్టెన్‌గా ఉన్నాను. సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు ఉన్నారు. కానీ, ఎక్కడి నుంచో వచ్చి ఎంఎస్ ధోనీ కెప్టెన్ అయ్యాడు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. కొందరి తలరాతలో నాయకుడిగా ఎదగాలని రాసిపెట్టి ఉంటుంది. కానీ, ఏళ్ల తరబడి జట్టు కోసం కష్టపడిన వారికి అవకాశం రానప్పుడు ఆటగాడిగా నిరాశ కలగడం సహజం" అని వివరించాడు.
ఫ్రాంచైజీ నిర్ణయంతో తాను ఏకీభవించలేనని, అయితే ఇప్పుడు నిర్ణయం జరిగిపోయిందని యువరాజ్ అన్నాడు. "రేపు హైదరాబాద్ గెలిస్తే నా మాటలు తప్పని నిరూపితం కావచ్చు. కానీ, నా అభిప్రాయం ప్రకారం వారి బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. నాయకుడిగా ఎదిగేందుకు ఐపీఎల్ గొప్ప వేదిక. అభిషేక్‌కు ఆ అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఏదేమైనా ఈ నిరాశను పక్కనపెట్టి, కెప్టెన్‌కు మద్దతు ఇస్తూ, జరిగిన అవమానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత కష్టపడి ఆడాలని అభిషేక్‌కు చెప్పాను" అని యువీ చెప్పుకొచ్చాడు.