Kanimozhi: బీజేపీతో పొత్తు పెట్టుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: కనిమొళి

Kanimozhi says political future bleak for those allying with BJP
షార్ట్స్‌లో చూడండి
బీజేపీతో జట్టు కట్టేవారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గపడిన విషయం తెలిసిందే. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనిమొళి స్పందించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే రాజకీయ పార్టీల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీ కూటమి చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు.

అన్నాడీఎంకే తీసుకున్న రాజకీయ నిర్ణయాలు తమిళనాడు, ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు భంకం కలిగించాయని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా వృద్ధి సాధించినట్లు చరిత్రలో లేదని అన్నారు. బీజేపీ, అన్నాడీఎంకేది మోసపూరిత పొత్తు అని విమర్శించారు. బీజేపీతో పొత్తు ద్వారా అన్నాడీఎంకే తమిళ ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేశారని విమర్శించారు.
Go Back to Shorts
Kanimozhi
DMK
BJP alliance
Tamil Nadu politics
ADMK
Tamil Nadu Assembly elections
political future

More Telugu News