Chandrababu Naidu: మీడియా సమావేశంలో స్వయంగా స్వీట్లు పంచిన సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో!
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఉండవల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ, సమావేశానికి హాజరైన మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీట్లు పంచిపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శుక్రవారం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వ నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు. రాజధాని విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చంద్రబాబు ఒక స్వీట్ బాక్స్‌ను చేతిలోకి తీసుకుని, అక్కడున్న ప్రతి జర్నలిస్టు వద్దకు స్వయంగా వెళ్లి మిఠాయిలు అందించారు. వారితో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సాధారణంగా అందరితో కలిసిపోయి స్వీట్లు పంచడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి తమ వద్దకు వచ్చి స్వీట్ అందించడంతో మీడియా ప్రతినిధులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.