Stock Market: భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమై, చివరకు లాభాల్లో ముగిశాయి. 1500 పాయింట్లకు పైగా నష్టం నుంచి సెన్సెక్స్ కోలుకోవడం గమనార్హం. సెన్సెక్స్ ఉదయం 72,262 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. నిన్నటి ముగింపుతో (73,134) 900 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు నష్టాల్లో కొనసాగిన సూచీలు, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. డాలరు మారకంతో రూపాయి మారకం విలువ బలోపేతం కావడం, అన్ని రంగాల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు రాణించాయి.

సూచీలు 185 పాయింట్లు లాభపడి 73,319 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33.70 పాయింట్ల లాభంతో 22,713 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 157 పైసలు కోలుకుని 93.13గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌స్ బ్యాంకు స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పేయింట్స్, ఎటర్నల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Rupee Dollar
HCL Technologies
Infosys
TCS

More Telugu News