Chandrababu Naidu: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని ఇరిగేషన్ శాఖ తక్కువ సమయంలో పూర్తి చేసిందని ప్రశంసించారు. ఇందుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు ఆయన అభినందనలు తెలిపారు.

దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించి నిర్మించామని పేర్కొన్నారు.

డయాఫ్రమ్ వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు వేగవంతమవుతాయని అన్నారు. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తిచేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని పునరుద్ఘాటించారు.
Chandrababu Naidu
Polavaram Project
Andhra Pradesh
AP Irrigation
Diafragm Wall
ECRF Dam
Polavaram Authority
AP Politics
Irrigation Project
Telugu News

More Telugu News