Tea: వేసవిలో వేడి వేడి చాయ్ ఒంటికి చలవ చేస్తుందట.. అదెలాగంటే!
మండే ఎండల్లో చల్లచల్లగా ఐస్క్రీమ్లు, కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. కానీ, వేడి వేడి చాయ్ తాగినా శరీరానికి చల్లదనం లభిస్తుందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. వేసవిలో వేడి పానీయాలు తాగడం వెనుక ఓ ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
థర్మోజెనిక్ ఎఫెక్ట్..
‘ది జర్నల్ ఆఫ్ ఫిజియోలాజికల్ సైన్సెస్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వేడి పానీయం తాగినప్పుడు శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దీన్ని గ్రహించిన మెదడు, శరీరాన్ని చల్లబరిచేందుకు చెమట గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దీంతో మనకు ఎక్కువగా చెమట పడుతుంది. ఆ చెమట చర్మంపై నుంచి ఆవిరయ్యే క్రమంలో శరీరంలోని వేడిని గ్రహిస్తుంది. ఫలితంగా శరీరం సహజంగా చల్లబడుతుంది. ఈ ప్రక్రియను ‘థర్మోజెనిక్ ఎఫెక్ట్’ అంటారు. వేసవిలో టీ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. టీలో అల్లం, యాలకులు చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీవక్రియలను వేగవంతం చేసి, ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గిస్తుంది. టీలోని కెఫీన్ చురుకుదనాన్ని ఇస్తుంది.
వాతావరణంలో తేమ ఉంటే..
ఈ ప్రయోజనం అన్ని పరిస్థితుల్లోనూ పనిచేయదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట సరిగా ఆవిరి కాదు. అలాంటి సమయంలో వేడి టీ తాగితే ఉక్కపోత మరింత పెరుగుతుంది. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు, అతిగా టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం మీద, పొడి వాతావరణంలో వేడి టీ తాగడం వల్ల చల్లని పానీయాల కన్నా మంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.