Adivi Sesh: ఆ అమ్మాయి కోసం కెనడా వెళ్లా.. కానీ వర్కవుట్ కాలేదు: లవ్ ఫెయిల్యూర్‌పై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Adivi Sesh Reveals Love Failure Experience Went to Canada
షార్ట్స్‌లో చూడండి
విభిన్నమైన కథలతో వరుస విజయాలు అందుకుంటున్న హీరో అడివి శేష్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన తాజా చిత్రం 'డెకాయిట్' ప్రమోషన్లలో భాగంగా తాను గతంలో ప్రేమలో విఫలమయ్యానని తొలిసారి వెల్లడించారు. ప్రేమించిన అమ్మాయి కోసం దేశం దాటి కెనడా వరకు వెళ్లినా, ఆ ప్రేమకథ మధ్యలోనే ముగిసిపోయిందని తెలిపారు.

ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న శేష్ మాట్లాడుతూ.. అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్పారు. ఆ సమయంలో సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, తన ప్రేమ కోసం ఎక్కువ సమయం కేటాయించానని అన్నారు. ఆ అమ్మాయి కోసం కెనడాకు కూడా వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ బంధం నిలవలేదని, అది లవ్ ఫెయిల్యూర్ తో ముగిసిందని శేష్ చెప్పుకొచ్చారు.

ఆ ప్రేమ వైఫల్యం తన జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని శేష్ తెలిపారు. ఆ అనుభవం తర్వాతే పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి సారించానని వివరించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం అడివి శేష్ తన కొత్త సినిమా 'డెకాయిట్' విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న శేష్, ఈ సినిమాతో మరో హిట్ కొడతాడని అభిమానులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Adivi Sesh
Adivi Sesh Decoit
Decoit movie
Adivi Sesh love failure
Adivi Sesh Canada
Tollywood news
Telugu cinema
Adivi Sesh interview
Adivi Sesh career

More Telugu News