Guruva Reddy: హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంచలన ఆరోపణలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఐడీ చీఫ్‌లకు ఆయన ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో 20 ఏళ్లుగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.

ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.69 కోట్లు బదిలీ కావడం కూడా అక్రమాల్లో భాగమేనని అన్నారు. ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆస్తులైన క్లబ్బులను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Guruva Reddy
Hyderabad Cricket Association
Telangana Cricket Association
HCA
TCA
Cricket Association Corruption

More Telugu News