Narendra Modi: తేయాకు ఆకులు కోసి, కార్మికులతో సెల్ఫీ దిగిన ప్రధాని నరేంద్రమోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోంలోని దిబ్రుగఢ్ జిల్లాలోని ఒక తేయాకు తోటను సందర్శించారు. అక్కడి మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులను కోశారు. వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను మోదీ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. పలువురు కార్మికులు మోదీతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. మోదీ రాక నేపథ్యంలో గిరిజన కార్మికులు సంప్రదాయ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు.

బహిరంగ సభలో రాహుల్ గాంధీపై విమర్శలు

అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోగముఖ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అసోంలో బీజేపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి వందోసారి ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు.

అసోం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. అసోంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు.
Narendra Modi
Assam
Tea Garden
Tea Leaves
Dibrugarh
Rahul Gandhi
Assam Elections
BJP

More Telugu News