Anirudh Reddy: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేఖ.. ఇప్ప చెట్ల పెంపకంపై కొత్త డిమాండ్
తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించిన ఉద్యమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా మేలు చేస్తుందన్న ఆయన డిమాండ్‌కు వివిధ పార్టీలకు చెందిన 52 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతుగా నిలవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా ఇప్ప పువ్వు, ఇప్ప ఉత్పత్తుల ప్రాముఖ్యతను వివరిస్తున్న అనిరుధ్ రెడ్డి, తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన, ఇప్పుడు ఏకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప చెట్ల పెంపకాన్ని ప్రభుత్వమే ఒక ఉద్యమంలా చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ డిమాండ్‌కు అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు లభిస్తోంది.
ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అనిరుధ్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలోని అర్ధ శుష్క ప్రాంతాల వాతావరణానికి ఇప్ప చెట్లు ఎంతో అనువైనవని, ఇవి కరువును సైతం తట్టుకుని బలంగా పెరుగుతాయని వివరించారు. ఇప్ప చెట్లు నేల సారాన్ని పెంచడంతో పాటు భూక్షయాన్ని సమర్థంగా నివారిస్తాయని, తద్వారా పచ్చదనాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని, అనువైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇప్ప చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు.
పర్యావరణ ప్రయోజనాలే కాకుండా, ఇప్ప చెట్ల వల్ల సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో లాభాలు ఉన్నాయని అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఇప్ప పువ్వులు, గింజలు గిరిజన, గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉపయోగపడతాయని అన్నారు. సమృద్ధిగా పోషక విలువలు, ఔషధ గుణాలున్న ఇప్ప ఉత్పత్తులను ఆహారంగా, స్థానిక వైద్యంలో వినియోగిస్తారని, తద్వారా ప్రజల జీవనోపాధికి, ఆరోగ్య సంరక్షణకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యేగా ప్రారంభించిన ఈ ఉద్యమానికి అనూహ్య మద్దతు లభిస్తుండటంతో ఇప్ప చెట్ల పెంపకంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.