Mumbai: చిన్న గొడవకు ప్రతీకారం.. పసివాడిని నేలకేసి బాదిన వ్యక్తి.. సీసీటీవీలో రికార్డైన ఘోరం!
ముంబై సమీపంలోని వసాయిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తితో జరిగిన చిన్న గొడవ మనసులో పెట్టుకుని, అతని నాలుగేళ్ల కుమారుడిపై ప్రతీకార దాడికి పాల్పడ్డాడో దుండగుడు. పసివాడిని నేలకేసి కొట్టి, ఇనుప రాడ్డుకు తలను బాదిన ఈ అమానుష ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
వివరాల్లోకి వెళితే.. వసాయిలోని ఓ హౌసింగ్ సొసైటీలో విఘ్నేశ్ అనే నాలుగేళ్ల బాలుడు, మరికొందరు పిల్లలతో కలిసి పార్క్ చేసి ఉన్న ఆటోరిక్షాలో ఆడుకుంటున్నాడు. బాలుడి తండ్రితో చిన్న విషయంలో గొడవపడిన సందీప్ పవార్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆటోలో ఉన్న విఘ్నేశ్‌ను కాళ్లు పట్టుకుని బయటకు లాగాడు. అనంతరం ఒకసారి నేలపై పడేసి, భవనంలోకి తీసుకెళ్లి అక్కడున్న ఇనుప రాడ్డుకు తలను బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా బాలుడిని మళ్లీ నేలకేసి కొట్టడం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.
తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్డులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సందీప్ పవార్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది.