Kurnool Rape Case: కర్నూలులో దారుణం.. 9వ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
ఏపీలోని కర్నూలులో అమానుష ఘటన వెలుగుచూసింది. పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ తన స్నేహితుడితో కలిసి 14 ఏళ్ల బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఇద్దరూ రోజుల తరబడి లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చింది. సోమవారం ఆ విద్యార్థిని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం బట్టబయలైంది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగర శివారు గ్రామానికి చెందిన ఓ బాలిక రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్తోంది. ఆటో డ్రైవర్ బోయ మహేంద్ర ఆ బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ తెలుగు శివకుమార్‌తో కలిసి వేధించాడు. విషయం బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించడంతో, భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ ఇద్దరు మృగాలు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలిక అనారోగ్యానికి గురికావడంతో, ఆమె తల్లిదండ్రులు ఈ నెల 28న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని తేలింది. అదే రోజు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక ప్రసవించడంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం బాధితురాలు, నవజాత శిశువు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల సంరక్షణలో ఉన్నారు. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలి కుటుంబం భయాందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.